వీడియో : భయంకరమైన ఇసుక తుఫానులో ఫ్లైట్ ల్యాండ్ చేసాడు.. మీరూ చూడండి

Wednesday, May 2nd, 2018, 01:28:34 AM IST

గల్ఫ్ దేశాల్లో సగానికంటే ఎక్కువ ప్రాంతాలు ఎదారులుగానే ఉండటం వల్ల ఇసుక తుపాను రావడం చాలా కామన్. అది ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు కనీసం వాతావరణ శాఖకు కూడా అంతు చిక్కదు. ఇలాగే ఇటివల సౌదీ అరేబియాలోని జజాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ విమానం ల్యాండ్ అవబోయే సమయానికే భయంకరమైన ఇసుక తుపాను ప్రారంభమైంది. కనీసం పొగ మాదిరి కూడా కనిపించనంత భారీ తరహాలో ఆ తుఫాను చెలరేగింది. రన్‌వే చుట్టూ ఇసుక చుట్టుముట్టడంతో పైలట్‌కు రన్‌వే కూడా కనిపించలేదు. ఎక్కడ చూసినా కూడా అంతా ఎడారి లాగా కనిపించడంతో పాటు మొత్తం దుమ్ముతో కూడిన పొగలా కమ్ముకుంది అక్కడి ప్రదేశం అంతా. అయినప్పటికీ.. త‌న‌ అనుభవంతో ధైర్యం చేసి విమానాన్ని సేఫ్‌గా లాండ్ చేశాడు పైలట్. ఇక.. దీనికి సంబంధించిన వీడియోను డబ్ల్యూఎమ్‌వో అనే సంస్థ తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవడమే కాదు.. నెటిజన్లకు కూడా తెగ నచ్చేస్తున్నది. ఆ వీడియో పైన మీరూ తిలకించండి మరి.!