వీడియో : గాల్లోకి దూసుకుపోయిన టెస్ శాటిలైట్‌

Thursday, April 19th, 2018, 01:14:12 PM IST

అమెరికాకు చెందిన నాసా ఇవాళ టెస్ శాటిలైట్‌ను ప్రయోగించింది. ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్(టెస్)ను ఫ్లోరిడాలోని కేప్ కెనరవల్ నుంచి ప్రయోగించారు. మన సౌర వ్యవస్థ అవతల ఉన్న ప్రపంచాన్ని ఈ ఉపగ్రహం పరిశీలించనున్నది. నక్షత్ర లోకంలో ఈ శాటిలైట్ విహరించనున్నది. అక్కడ ఏమైనా ఏలియన్ ప్రపంచాలు, గ్రహాలు ఉన్నాయా అన్న కోణంలోనూ ఈ శాటిలైట్ పనిచేయనున్నది. టెస్ ఇచ్చే డేటా ఆధారంగా ఇతర టెలిస్కోప్‌లు మరింత సమాచారం కోసం లోతైన విశ్లేషణ చేపట్టనున్నాయి. టెస్‌కు మొత్తం నాలుగు సెన్సిటివ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ కెమెరాలు మొత్తం ఆకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాయంటున్నారు. స్పేస్ఎక్స్ సంస్థ‌కు చెందిన ఫాల్క‌న్ 9 రాకెట్ ద్వారా టెస్ ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి పంపారు.

  •  
  •  
  •  
  •  

Comments