ఐపీఎల్ వేలంలో అధిక ధర పలికిన ఆటగాళ్లు!

Saturday, January 27th, 2018, 11:04:59 PM IST

అనుకున్నవిధంగానే 2018 మొదటి రోజు ఐపీఎల్ వేలం మంచి ఆసక్తికరంగా సాగింది. పది సంవత్సరాల తర్వాత పెద్ద ఎత్తున జరుగుతున్న వేలం కావడంతో ప్రతి ఒక్కరు ఉత్సవాహంతో వేలాన్ని తిలకించారు. అనూహ్యంగా ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ను ఈ ఐపీఎల్ వేలంలో 12.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. తరువాత భారత బ్యాట్స్ మన్ కె ఎల్ రాహుల్ ను 11 కోట్లకు పంజాబ్ జట్టు దక్కించుకుంది. మరొక భారత బ్యాట్స్ మన్ మనీష్ పాండే ను రాజస్థాన్ జట్టు అదే 11 కోట్లకు చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియన్ బాట్స్ మన్ క్రిస్ లిన్ ను 9.6 కోట్లకు కోల్ కతా, ఆస్ట్రేలియన్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను 9.4 కోట్లకు కోల్ కతా, ఆఫ్గనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ ను 9 కోట్లకు హైద్రాబాద్, ఆస్ట్రేలియన్ బాట్స్ మన్ మాక్స్ వెల్ ను 9 కోట్లకు ఢిల్లీ , ఇండియన్ ఆల్ రౌండర్ క్రునల్ పాండ్య ను 8.8 కోట్లకు ముంబై, భారత బ్యాట్స్ మన్ కం వికెట్ కీపర్ అయినా సంజు శాంసన్ ను 8 కోట్లకు రాజస్థాన్ రాయల్స్, భారత బాట్స్ మన్ కేదార్ జాదవ్ ను 7.8 కోట్లకు చెన్నై, భారత వికెట్ కీపర్ కం బ్యాట్స్ మన్ దినేష్ కార్తీక్ 7.4 కోట్లకు కోల్ కతా చేజిక్కించుకుంది. అయితే పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, జోయ్ రూట్, మురళి విజయ్, హషిమ్ ఆమ్లా, మార్టిన్ గుప్తిల్, జేమ్స్ ఫాల్కనర్, జానీ బెయిర్ స్టో, నమన్ ఓజా, మిచెల్ జాన్సన్, జోష్ హాజిల్వుడ్, టిమ్ సౌతీ, ఇషాంత్ శర్మ, మిచెల్ మేక్లేషన్, లసిత్ మలింగా వంటి ఆటగాళ్లు ఇప్పటికి అన్ సోల్డ్ ప్లేయర్ లు గా మిగిలారు. అయితే ఇంకొక్క రోజు మిగిలి ఉండడంతో రేపు జరిగే వేలంలో ఎంతమంది అమ్ముడుపోతారో అని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు…