వాట్సాప్ లో ఈ మెసేజ్ వస్తే తస్మాత్ జాగ్రత్త!

Sunday, May 6th, 2018, 05:52:15 PM IST

ఇంటర్నెట్ వినియోగం అధికం కావడంతో మనం నిత్యం ఈమెయిల్స్, వాట్స్అప్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలని అధికంగా వాడుతుంటాం. అయితే గత కొన్నాళ్లుగా మీకు లాటరి తగిలింది, మీ అడ్రస్, డీటెయిల్స్ నింపి పంపండి వంటి ఫేక్ మెయిల్స్, మెస్సేజ్ లు రావడం విన్నాం. అయితే కొత్తగా అది సోషల్ మీడియా మాధ్యమం వాట్స్ అప్ లోకి కూడా ప్రవేశించింది. గత కొద్దిరోజులుగా వాట్సాప్ లో ఒక సందేశం చక్కర్లు కొడుతోంది. దానిపై నిపుణులు సునిశితంగా పరిశీలించిన పిదప అది ఒకరకమైన వైరస్ గా నిర్ధారించారు. మొదట వాట్సాప్ లో ‘డోంట్ టచ్ మీ హెయిర్ డోంట్ టచ్ ఇట్ ‘ పేరిట ఒక సందేశం వస్తుంది.

దాని తరువాత చిన్న బ్లాక్ కలర్ బాల్ గుర్తుతో మరొక సందేశం వస్తుంది. అది ఒకవేళ మనం క్లిక్ చేస్తే కనుక, పలురకాల సంజ్ఞలతో డిస్ప్లే రకరకాలుగా మారి వాట్సాప్ సహా ఫోన్ మొత్తం హ్యాంగ్ అవుతుందట. అయితే ఈ తరహా మెసేజ్ ల పై యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, అదేదో జోక్ గా పంపారు అనుకుంటే పొరపాటని, అది డేంజరస్ వైరస్ అని, క్లిక్ చేయగానే మన వాట్సాప్, ఇతర యాప్స్ సహా మొత్తం ఫోన్ డేటా కేప్చర్ చేయడంతోపాటు ఫోన్ ను క్రాష్ చేస్తుందని గట్టిగా హెచ్చరిస్తున్నారు. సో వాట్సప్ యూజర్స్ ఈ తరహా మెసేజ్ మీ వాట్సాప్ లో డిస్ప్లే అయితే మాత్రం దాన్ని క్లిక్ చేయకండి……

Comments