మోడీ రేపు ఏం మాట్లాడతారు .. ఎదురు చూస్తున్న దేశం .. 2000 నోట్లు 100 నోట్లు కూడా రద్దు చేస్తారా ?

Friday, December 30th, 2016, 11:45:47 AM IST

modi1
నవంబర్ 8 న జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోడీ పేద నోట్ల రద్దు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు .. మళ్ళీ రెండు నెలల కాలం తరవాత మోడీ రేపు – శనివారం మరొక్కసారి తన మనసులో మాటని చెప్పబోతున్నారు. ప్రధాని మాట్లాడబోతున్నారు అని ప్రకటన రాగానే ఈ సారి ఏం మాట్లాడతారు అనే విషయం మీద తీవ్ర చర్చ రేగుతోంది. ప్ర‌జ‌ల క‌ష్టాలు తీర్చ‌డానికి మోదీ అడిగిన‌ 50 రోజుల గ‌డువు నేటి రాత్రితో ముగియ‌నున్న నేప‌థ్యంలో శ‌నివారం రాత్రి ఆయ‌న ప్ర‌సంగం ఉంటుంద‌ని కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు తెలిపారు.పెద్ద‌నోట్ల ర‌ద్దు త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించడంతోపాటు భ‌విష్య‌త్తులో చేప‌ట్టే చ‌ర్య‌ల గురించి ప్ర‌ధాని మోదీ మాట్లాడే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అలాగే నోట్ల ర‌ద్దుతో సాధించిన విజ‌యాలతోపాటు న‌ష్టాల‌ను కూడా వివ‌రిస్తార‌ని స‌మాచారం. అలాగే ప్ర‌జ‌ల‌కు బోల్డ‌న్ని తాయిలాలు ప్ర‌క‌టించే అవ‌కాశం కూడా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ప్ర‌సంగంలో ఐదు కీల‌క అంశాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. పెద్ద నోట్లని ప్రభుత్వం రద్దు చేసి రెండువేల నోట్ల చలామణీ కి తీసుకుని వచ్చారు , ఇప్పుడు ఈ నోట్లని కూడా రద్దు చేసే అవకాసం ఉంది లేదా వంద అంతకంటే చిన్న నోట్ల స్థానం లో ప్లాస్టిక్ కరన్సీ రావచ్చు. రైతుల పంట రుణాలు పూర్తిగా రద్దు చేయడం లేదంటే జీరో బ్యాలన్స్ ఉన్న జనధన్ ఖాతాల్లో పదివేలు వెయ్యడం. నాలుగోది న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ‌పై ప్ర‌స్తుత‌మున్న ఆంక్ష‌లు ఎత్తివేయ‌డం, చివ‌రిది బినామీ ఆస్తుల‌పై తీసుకునే చర్య‌ల విష‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments