స్వీడన్ చేరుకున్న మోదీ… ఘన స్వాగతం పలికిన స్వీడన్ ప్రధాని స్టీఫన్

Tuesday, April 17th, 2018, 10:07:33 AM IST

మోదీ ప్రధాని అయిన నాటి నుండి నాలుగేళ్ళుగా ఎప్పుడూ ఎదో ఒక దేశానికి వివిధ అంశాల నేపద్యంలో పర్యతిస్తూనే ఉన్నాడు. తాజాగా మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈ రోజు స్వీడన్‌కు చేరుకున్నారు. స్వీడన్ చేరుకున్న ప్రధాని నరేంద్రమోడీకి ఆ దేశ ప్రధాని స్టీషన్ స్వాగతం పలికారు. ఈ రోజు స్వీడన్ – భారత్ వాణిజ్య ఆర్థిక సంబంధాలపై ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రెండు దేశాల దిగ్గజ వ్యాపారవేత్తలతో భారత్, స్వీడన్ ప్రధానులు సమావేశం కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, శాస్త్రసాంకేతికత, శుద్ధ ఇంధనం, ఆకర్షణీయ నగరాలపై చర్చించనున్నారు. అనంతరం ప్రధాని మోడీ ఇండియా – నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. సదస్సులో ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్ దేశాల ప్రధానులు పాల్గొంటారు. స్వీడన్ తరువాత బ్రిటన్, జర్మనీలో ఈ నెల 20 వరకు ప్రధాని పర్యటించనున్నారు.