‘వెంకన్న’ని వదిలేయమని వేడుకుంటున్న చంద్రబాబు !

Wednesday, September 27th, 2017, 11:27:56 AM IST


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోట్ల రద్దు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ రెండవ దఫా పెద్ద నోట్ల రద్దుని ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు. 2000 నోట్లు అవసరం లేదని వాటిని వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు అన్నారు. ఏదైనా మంచి పని ప్రారంభించే సమయంలో ఇబ్బందులు ఎదురు కావడం సహజం అని అన్నారు. దీర్ఘకాలంలో ఇలాంటి నిర్ణయాల వలన మంచి ఫలితాలు వస్తాయని బాబు పేర్కొన్నారు. పెద్ద నోట్ల వలన అవినీతి పెరుగుతుందని గతంలో తాను అనేక మార్లు తెలిపినట్లు చంద్రబాబు అన్నారు.

2000 నోట్లని తీసుకుని వచ్చి మోడీ ప్రభుత్వం తప్పు చేసిందా అనే ప్రశ్నకు సమాధానంగా.. పెద్ద నోట్ల రద్దు సమయంలో అధికమొత్తంలో కరెన్సీ కొరత ఏర్పడింది. దానిని భర్తీ చేయాలంటే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి అని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు 2000 నోట్ల అవసరం తీరిపోయింది అని వాటిని వెంటనే రద్దు చేయాలని బాబు మోడీకి సూచించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన తరువాత చంద్రబాబు జీఎస్టీ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ అమలైన తరువాత కొన్ని శాఖలు ఇబ్బందులని ఎదుర్కొంటున్నాయని వాటికి జీఎస్టీ నుంచి మినహాంయింపు కల్పించాలని ఆర్థిక మంత్రిని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా జీఎస్టీ పరిథిలోకి వచ్చిందని అలాంటివాటికీ జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments