తల్లి చెంత నరేంద్రుడు..66 వ పడిలో మోడీ !

Saturday, September 17th, 2016, 11:40:30 AM IST

modi-with-mother
భారత ప్రధాని నరేంద్ర మోడీ 66 వ పడి లోకి అడుగు పెట్టాడు.నేడు మోడీ జన్మ దినం.ఈ సందర్భంగా మోడీ శుక్రవారం అహమ్మదాబాద్ చేరుకున్నారు.శనివారం ఉదయం గాంధీనగర్ చేరుకున్నమోడీ తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం పొందారు.ఈ సందర్భంగా ఆయన తన తల్లికోసం కొంత సమయాన్ని కేటాయించారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు దావోద్ జిల్లాకు వెళ్లనున్నారు.

నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియాద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో సహా పలువురు ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అరుణ్ జైట్లీ , వెంకయ్య నాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు మోడీ కి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.