మోడీకి మ‌ర్యాద అవ‌స‌రం లేద‌ట‌

Friday, September 30th, 2016, 01:17:46 PM IST

narendra-modi
అధికారంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల‌ను గౌర‌వించ‌డం అంద‌రి బాధ్య‌త‌. ఆ నాయ‌కుల పేర్ల‌ను సంబోధించే ముందు గౌర‌వనీయెలైనా… శ్రీ‌ లేక మాన్యులు అనే ప‌దాల‌తో ముందుగా ప్ర‌స్థావిస్తాం. కానీ ఇలాంటివి దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి న‌చ్చ‌న‌ట్లున్నాయి. అందుకే త‌న పేరు ముందు గానీ.. పోస్ట‌ర్ల‌ల‌లో గానీ ప్ర‌ధాని మోదీ అంటే చాలు.. అంత‌కు మించి మ‌ర్యాద‌లు అవ‌స‌రం లేద‌ని ప్ర‌ధాని కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న రిలీజ్ అయింది. గౌర‌వం అనే ప‌దాన్ని వేయ‌డం వ‌ల్ల సామాన్య ప్ర‌ల‌కు దూరంగా ఉంటున్నామ‌నే భావ‌న క‌ల్గుతుంద‌నే ఉద్దేశంతోనే మోదీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ప్ర‌ధానికిగా కొన‌సాగిన వారెవ్వ‌రు ఇలాంటి నిర్ణ‌యాలు తీసుకోలేదు.

ఈ నేపథ్యంలో ఇదే విధానాన్ని ఇత‌ర కేంద్ర మంత్రులు.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా పాటిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇది వాళ్ల వ్య‌క్తిగ‌త విష‌యానికి సంబంధించింది కాబ‌ట్టి వాళ్లే స్వ‌యంగా నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంటుంది. మ‌ర్యాద అనేది ప్ర‌జ‌లు అభిమానించి ఇవ్వాలి…భ‌య‌పెట్టో..ప‌ద‌విలో ఉన్నామ‌నో భ‌య‌ప‌డి ఇచ్చేది కాద‌ని ప్ర‌ధాని ఉద్దేశం అన్న‌ట్లు తెలుస్తోంది. చూద్దా ఎంత మంది నాయ‌కులు ప్ర‌ధాని బాట‌లో వెళ్తారో?