ప్రధాని స్కెచ్ వేస్తే ఇంత వీక్ గా ఉంటుందా బాబుగారు !

Sunday, September 16th, 2018, 01:10:46 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న హైడ్రామా బాబ్లీ కేసులో చంద్రబాబు నాయుడుకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. ప్రత్యేకహోదా విషయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో కన్నెర్రజేసిన ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడుపై ఉన్న ఈ పాత కేసును బయటికిలాగి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యేలా చేశారని ఉపముఖ్యమంత్రి దగ్గర్నుండి కిందిస్థాయి కార్యకర్త వరకు అందరూ బల్ల బద్దలుకొట్టి మరీ వాదించేస్తున్నారు.

ఆద్యంతం నాటకీయంగా కనిపిస్తున్న ఈ వివాదంలో ఎప్పుడో 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ కేసు పెడితే, దాన్ని ఇన్నాళ్లు నిర్లక్ష్యం చేసి చివరికి అరెస్ట్ వారెంట్ వరకు టీడీపీ తెచ్చుకోవడం, దాన్నిప్పుడు రాజకీయ లబ్ది కోసం బీజేపీ మీదికి తోసేస్తుండటం నవ్వు తెప్పించే మొదటి అంశం.

ఒకవేళ టీడీపీ వాదన ప్రకారం ప్రధాని మోడీ నిజంగానే బాబుపై కక్ష సాధింపుకు దిగి ఆయన్ను ఇబ్బందుల్లో పడేయడానికి స్కెచ్ వేశారే అనుకుందాం. అందుకోసం ఆయన బాబుపై అత్యంత బలంగా ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీని కోసుగోలు వ్యవహారమైన ఓటుకు నోటు కేసును ఏదో ఒక
విధంగా తెర మీదికి తెచ్చి వాడుకుంటారు కానీ ఇలా కోర్టు పరిధిలో కొద్ది వ్యవధిలోనే ఎలాంటి నష్టం లేకుండా తేలిపోగల ధర్నా కేసును తిరగదోడిస్తారా.. ఎంతోమంది కొమ్ములు తిరిగిన రాజకీయ నాయకుల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన మోడీ స్కెచ్ వేస్తే మరీ ఇంత బలహీనంగా ఉంటుందా అనేది ఇప్పుడు జనాల నాలుకలపై నానుతున్న మరొక జోక్.

  •  
  •  
  •  
  •  

Comments