షాకింగ్ న్యూస్ : చీమ కుట్టి మహిళా మృతి

Thursday, April 5th, 2018, 08:13:53 PM IST

శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. పైన యముడు కన్నెర్ర జేసాడో లేక శివుడు ఆగ్నాపించాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ప్రమాదం జరిగిపోయింది. సామాన్యంగా చీమలు కుడితే ఏ దద్దుర్లు రావడమో, లేక వాచీ పోవడమో జరుగుతుంది. కానీ ఇక్కడ ఏకంగా ప్రాణమే పోయింది. విషపూరితమైన చీమ కుట్టడం వల్ల సౌదీ అరేబియాలో ఓ మహిళ మృతి చెందింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ప్రాణాలు కోల్పోయిన మహిళ భారత్‌కు చెందిన వారే. కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36ఏళ్ల మహిళ కొంతకాలంగా సౌదీలో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న ఆమె ఇంట్లో ఉండగా ఏదో కుట్టినట్లు అనిపించందని తన భర్త జెఫ్పీ మాథ్యూకు చెప్పింది. చుట్టుపక్కన చీమను గుర్తించిన మాథ్యూ దాన్ని అక్కడి నుంచి తీసి బయట పడేశారు. వెంటనే ఆమె శరీరం వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. శరీరంపై అలర్జీ ఎక్కువ కావడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్సను అందించారు. తీవ్రంగా కృషి చేసిన వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. శరీరంలోని జరిగిన రియాక్షన్స్ వల్లే ఈ మరణం సంభవించిందని, కరిచిన చీమ చాలా విశాపూరుతమై ఉంటుందని, అందుకే కాపాడటానికి కష్టతరమైందని డాక్టర్లు వెల్లడించారు.

  •  
  •  
  •  
  •  

Comments