కొత్త కాంట్రాక్ట‌ర్‌కి పోల‌వ‌రం ప‌నులు..

Tuesday, October 31st, 2017, 11:44:13 AM IST

పోల‌వ‌రం కాంట్రాక్ట్ వేరొక‌రికి.. క‌ట్ట‌బెట్ట‌నున్నారా? సీఎ ర‌మేష్ నుంచి ప్రాజెక్టుల్ని వెన‌క్కి తీసుకోనున్నారా? అంటే అవున‌నే ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో ముచ్చ‌ట సాగుతోంది. పోల‌వ‌రం ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్‌పై చ‌ర్య‌లు.. తీసుకునేందుకు సీఎం చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే సీఎం ర‌మేష్ కి చెందిన రిత్విక్ సంస్థ వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు చేప‌ట్టింది. ఇవ‌న్నీ మ‌ధ్య‌లోనే ఉన్నాయి. అయితే ఉన్న ఫ‌లానా ఆ ప‌నులు ఆపేసి అయినా.. కొన్ని ప‌నులకు మ‌ళ్లీ టెండ‌ర్లు పిలిచేందుకు క‌స‌ర‌త్తు.. చేస్తున్నార‌ని వెల్ల‌డైంది. సీఎం కోపంగా..ఉన్నారు. నవంబ‌ర్ 1న కేబినెట్ స‌మావేశంలో నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని చెబుతున్నారు. అయితే పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల‌పై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంటుంది. కొత్త కాంట్రాక్టు పెట్టుకుంటే.. రాష్ట్ర‌ప్ర‌భుత్వ‌మే నిధులు భ‌రించాలి. అందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఇక 2019కి పూర్తిగా పోల‌వ‌రం పూర్తి చేయాల‌ని, 2018లోనే గ్రావిటీ ద్వారా నీటి విడుద‌ల‌..చేయాల‌ని సీఎం టార్గెట్ ఫిక్స్ చేశారుట‌. ఇక కొత్త‌గా కాంట్రాక్టులు వేరొక‌రికి అప్ప‌జెబితే 200 కోట్లు అద‌న‌పు వ్య‌యం చేయాల్సి వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం భ‌రించాల్సిందేన‌ట‌. అయితే దీనిపై ఇంకా అధికారులు ధృవీక‌రించాల్సి ఉంది. పోల‌వ‌రంపై ఇదివ‌ర‌కూ రాష్ట్రం 1000 కోట్లు ఖ‌ర్చు చేసింది. కేంద్రం నుంచి ఇంకా నిధులు రిలీజ్ కానేలేదు. దీనిపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. ఇక పోల‌వ‌రం – ఇర్రిగేష‌న్ ప‌నుల్లో 1000 కోట్ల మేర కొత్త టెండ‌ర్లు పిలిచేందుకు స‌న్నాహాలు చేస్తున్నారుట‌.

  •  
  •  
  •  
  •  

Comments