తేదేపా- భాజ‌పా క‌ప‌ట‌నాట‌కాలే పోల‌వ‌రానికి ముప్పు!!

Monday, February 11th, 2019, 12:59:14 PM IST

పోల‌వ‌రం ప్రాజెక్ట్ విష‌యంలో కేంద్రంలో వున్న బీజేపీ కుట్ర చేసిందా?. ఆ కుట్ర‌లో భాగంగానే స‌రైన స‌మ‌యానికి నిధులు అందించ‌క‌పోవ‌డం వ‌ల్లే పోల‌వ‌రం ప‌నులు న‌త్త‌న‌డ‌క‌న సాగుతున్నాయా?. తెలంగాణ‌లో భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్ట్ ప‌నులు మెరుపు వేగంతో పూర్త‌వుతుంటే పోల‌వ‌రం మాత్రం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఆల‌స్యం అవుతూ వ‌స్తోందా? అంటే ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ధ‌ర్మ‌పోరాట దీక్ష‌లో మాట్లాడుతున్న నేత‌లు కీల‌క అంశాల్ని బ‌య‌ట‌పెడుతున్నారు.

పోల‌వ‌రంపై కేంద్రం స‌వ‌తి ప్రేమ చూపిస్తూ.. కేటాయించిన కొద్ది పాటి నిధుల్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కాంట్రాక్ట‌ర్లు బొక్కేయ‌డం.. నిధుల్ని ఇష్టానికి వాడుకోవ‌డం, స‌గం ప‌ర్సంటేజీల రూపంలో వృధా అవ్వ‌డం.. వంటి కార‌ణాల వ‌ల్లే పోల‌వ‌రం ఇంకా పూర్తి కావ‌డం లేద‌ని నేత‌ల మాట‌ల‌ను బ‌ట్టి తెలుస్తోంది. “ఏపీకి నిధులు కేటాయించాం. అందులో పోల‌వ‌రానికి భారీగా నిధులిచ్చ‌మ‌ని కేంద్రం బాహ‌టంగా ప్ర‌క‌టించినా… అందులో ఎలాంటి వాస్త‌వం లేద‌ని, కేంద్రం క‌ప‌ట‌ప్రేమ చూపిస్తోంద‌ని, స‌మ‌యానికి అనుకున్న స్థాయిలో నిధులు కేటాయించ‌లేద‌ని ఏపీ తేదేపా నేత‌లు దిల్లీ స‌భ‌లో ఉటంకిస్తే కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో కేంద్రం డ‌బుల్ గేమ్ ఆడుతోంద‌ని తేలిపోయింది. ఒక వేళ రాష్ట్ర ప్ర‌భుత్వం నిధులు కేటాయించి పూర్తి చేయాల‌ని పూనుకున్నా అందులో వ‌చ్చిన నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌ని, పోల‌వ‌రం ప‌నుల్లో భారీ అవినీతి జ‌రిగింద‌ని తేలిపోయింది. కార‌ణం ఏదైనా పోల‌వ‌రం విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌కు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వం కుచ్చుటోపీ పెట్టేయ‌డంపై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వై.ఎస్‌. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉండి ఉంటే పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఇప్ప‌టికి ఎప్పుడో పూర్త‌యి ఏపీని మ‌రింత సంప‌న్న రాష్ట్రంగా మార్చేదేన‌న్న వాద‌నా తెర‌పైకి వ‌చ్చింది. టీడీపీ- భాజ‌పా అల‌యెన్స్ లో నేత‌ల చిల్ల‌ర‌ రాజ‌కీయాల వ‌ల్ల ఏపీ ఎదుగుద‌ల ప్ర‌శ్నార్థంకంగా మారిపోయింద‌న్న విమ‌ర్శ‌లు తీవ్ర‌త‌రం అయ్యాయి.