పోలవరం..ఇక పరుగులే..!

Tuesday, September 27th, 2016, 08:43:56 AM IST

polavaram
పోలవరం నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఇక తొలగినట్లే.పోలవరం జాతీయ ప్రాజెక్ట్ నిర్మాణానికి రుణం అందించేందుకు వ్యవసాయ గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు(నాబార్డు ) స్పష్టం చేసింది.నాబార్డు ఈ రుణాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆధీనం లోని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ )కి ఈ రుణం అందించనుంది.పీపీఏ నుంచి నిధులు రాష్ట్రప్రభుత్వానికి అందుతాయి.ఈ రుణాన్ని నాబార్డు కు తిరిగి చెల్లించే భాద్యత కేంద్రమే తీసుకుంటుంది.

దీనిపై సోమవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి సుజనా చౌదరి కార్యాలయంలో కీలక భేటీ జరిగింది.అనంతరం మీడియాతో మాట్లాడిన సుజనా చౌదరి ఈ విషయాన్ని స్పష్టం చేశారు.వచ్చే నెల 15 నాటికి తొలి దశ నిధులు అందనున్నట్లు ప్రకటించారు.దీనితో పోలవరం ప్రాజెక్టు కు సంభందించిన అన్ని అడ్డంకులు తొలగినట్లే అని రాష్ట్ర ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments