మేకప్ పేరుతో లేడి బురిడీ…..ఎట్టకేలకు కిలేడీని అరెస్ట్ చేసిన పోలీసులు!

Thursday, June 14th, 2018, 02:37:19 PM IST

బ్యూటీ పార్లర్లను టార్గెట్ చేస్తూ గత కొంత కాలంగా ఓ మాయలేడి దొంగతనాలను చేస్తోంది. అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎవరు లేని సమయంలో మహిళల బంగారు నగలను ఎత్తుకుపోవడం చేస్తున్న మహిళను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నాలుగు నెలల వ్యవధిలోనే ఈ కిలాడీ 25 దొంగతనాలు చేసి ఆనవాళ్లు కూడా దొరక్కుండా చేసింది. ఆమెను పట్టుకోవడానికి ఎంతో శ్రమించిన పోలీసులు చివరికి మాయలేడి జాడ చెబితే 25 వేల నగదు బహుమతి ఇస్తాం అని అఫర్ ఇచ్చారు.

ఇక ఫైనల్ గా నార్త్ జోన్ – మారేడుపల్లి పోలీసులు కంటపడి చిక్కింది. అసలు వివరాల్లోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం. మాయలేడి అసలు పెరి డేసి. కడపకు చెందిన వీళ్ళ కుటుంబం చెన్నై లో స్థిరపడింది. డేసికి పెళ్లి కూడా జరిగింది. అయితే ఆమె జల్సాలకు బాగా అలవాటు పది ఇటువంటి దొంగతనాలు చేస్తోంది. జనం ఎక్కువగా రాణి బ్యూటీ పార్లర్లను ఎంచుకుని వాటిని టార్గెట్ చేసి ఎంతో చాకచక్యంగా నగలు దొంగిలించడం మొదలుపెట్టింది. తొలుత తమిళనాడులో దొంగతనాలు మొదలుపెట్టిన ఆమె అక్కడ రాను రాను నిఘా పెరగడంతో ఇటీవల తన మకాం హైదరాబాద్ కు మార్చింది.

భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిన ఆమె హైదరాబాద్ లోని పఠాన్ చెరువు ఏరియాలో ఇల్లు అద్దెకు తీసుకుని దొరికిన బస్సు ఎక్కి రద్దీ ఎక్కువగా లేని బ్యూటీ పార్లర్లలో చొరబడి వారికి మేకప్ పేరుతో తన మాయమాటలతో మౌత్ ఫ్రెషనర్ వంటివాటితో మత్తు మందు కలిపి నగలు దోచుకెళ్లడం మొదలెట్టింది. అయితే ఇక్కడ కూడా పలు బీటీ పార్లర్లలో దొంగతనాలు చేస్తున్న ఆమె పై పలు కేసులు నమోదు అయ్యాయి. కాగా ఈ కేసు ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ లు నిఘా వేసి దొంగతనం చేసిన చోట్ల వున్న సిసి టివి ఫుటేజీ ని బట్టి ఆమె ఆచూకీని తెలుసుకుని ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆమె చోరీల్లో భర్త ఏవిధంగా సహాయం చేసాడో, దొంగిలించిన నగలను ఏమి చేసింది అనే దానిపై పోలీస్ లు ఆరా తీస్తున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments