వివాహితను ఎత్తుకుపోయిన కానిస్టేబుల్

Monday, April 30th, 2018, 10:56:45 AM IST

రక్షించే పోలీసులే దారుణమైన అక్రమాలకూ పాల్పడుతున్నారు. అడ్డు దారి తొక్కుతున్న సొసైటీని మార్చాల్సింది పోయి పోలీసులే తప్పుడు పనులు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో అఖిల అనే వివాహిత మిస్సింగ్ కేసు నమోదైంది. ఆవిడ భర్త పోలీస్ స్టేషన్ కు వచ్చి గత రెండు రోజులుగా తన భార్య కనిపించడంలేదు అని కేసు పెట్టడం జరిగింది. అఖిల ఫోన్ కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు, కానిస్టేబుల్ విజయరంజన్‌తో ఎక్కువ మాట్లాడినట్లు గుర్తించారు. విజయరంజన్ తన భార్యను తీసుకుని వెళ్లి ఉండవచ్చని భర్త ఫిర్యాదులో పేర్కొన్నాడు. పరారీలో ఉన్న కానిస్టేబుల్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇద్దరు దొరికిన వెంటనే కేసు క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడికి శిక్షపడేలా చూస్తామని పోలీసులు తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments