ఖైదీతో లవ్ లో పడ్డ పోలీస్..మొదటి భార్య ఉండగానే వివాహం..!

Sunday, February 19th, 2017, 12:20:26 PM IST


పాట్నాకు చెందిన ఓ కానిస్టేబుల్, ఓ కేసులో శిక్ష అనుభవితున్న మహిళా ఖైదీతో ప్రేమలో పడ్డాడు. అంతే కాదు ఆమెని వివాహం చేసుకున్నాడు కూడ. ఫిబ్రవరి 14 వీరిద్దరి వివాహం కూడా జరిగింది. బీహార్ లోని కతిహార్ జైలులో మహమ్మద్ ఇనాముల్(52) కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పోలీస్ లు గతేడాది సరిఫుల్ ఖాతూన్(25)అనే యువతిని దొంగతనం, కిడ్నాప్ కేసులో పోలీస్ లు అరెస్టు చేసి కతిహార్ జైలుకు తరలించారు.ఆమెకు 8 నెలల శిక్ష పడింది.

గతంలోనే మహమ్మద్ ఇనాముల్ కు ఓ మహిళతో వివాహం జరిగింది. అయినాకూడా సరిఫుల్ పై మనసు పడ్డాడు. సరిఫుల్ కూడా ఇనాముల్ ని ప్రేమించింది.కానీ ఎవరూ ఒకరిపై ఒకరికి గల ప్రేమని వ్యక్తపరచలేదు. ఆమె జైలు శిక్ష పూర్తి చేసుకుని విడుదలైన తరువాత ఇనాముల్ ఫిబ్రవరి 13 న సరిఫుల్ కు గులాబీ ఇచ్చి ప్రపోజ్ చేసాడు. అతని ప్రేమని ఆమెకూడా అంగీకరించడంతో ఇనాముల్ అందానికి అవధులు లేకుండా పోయింది.ఇనాముల్, సరిఫుల్ ల వివాహానికి అతని మొదటి భార్య కూడా అడ్డు చెప్పలేదట. చివరికి వీరిద్దరి వివాహం జరిగి కథ సుఖాంతం అయింది.