ప్రేమ వ్యవహారం లో పోలీసుల జోక్యo ….. చేదు అనుభవం ఎదురు !

Saturday, May 26th, 2018, 10:20:09 PM IST

ప్రేమ వ్యవహారం లో జోక్యం చేసుకున్నందుకు పోలిసులకు చేదు అనుభవం ఎదురైoది. ఎంతలా అంటే ప్రజలనుంచి తప్పించుకునేందుకు చివరకు పోలీసులే గదుల్లోకి కి వెళ్లి గడియ పెట్టుకునేoతలా….ఈ ఘటన తాడిమర్రి మండలం లోని పోలీసు ఠాణా లో చోటు చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే తాడిమర్రి మండలం మోదుగులగుంటకి చెందిన లక్ష్మి మరియు అదే మండలo లోని చిల్లకొండాయపల్లికి చెందిన వినోద్‌ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దాంతో తమ ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరు అని ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకోవడానికి పారిపోయారు . దీంతో తమ కుమార్తె ఐదు రోజులుగా కనిపించడం లేదని లక్ష్మి తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐతే విషయం తెలుసుసుకున్న ఎస్సై వేణుగోపాల్‌ శుక్రవారం ఉదయం ప్రేమ జంటను మరియు కుటుంబ సభ్యులను పోలీసుస్టేషన్‌కు పిలిపించారు. లక్ష్మి తో మాట్లాడిన తర్వాత కుటుంబసభ్యుల వెంట వెళ్లేందుకు ఒప్పుకుంది. అయితే లక్ష్మి మోదుగులకుంట వెళ్లిన తర్వాత ఊహించని విధంగా పురుగుల అందు తాగి ఆత్మ హత్య చేసుకుంది. దాంతో ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి తన కూతరు పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకుంది అని పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ విషయం తెలిసిన లక్ష్మి ప్రియుడు వినోద్‌ కుటుంబసభ్యులు, మరియు చిల్లకొండాయపల్లికి చెందిన గ్రామస్థులు తాడిమర్రి పోలీసుస్టేషన్‌కు తరలివచ్చి ఆందోళనకి దిగారు . మరియు ఎస్‌ఐ తీరుతోనే లక్ష్మి మృతి చెందిందని ఆమె మృతదేహాన్ని చూపించాలని పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. అంతే కాక ఒక్కసారిగా గ్రామస్థులంతా కలిసి ఎస్సై వేణుగోపాల్‌పై దాడి చేసే ప్రయత్నం చేసారు .. దాంతో వారిని నిలువరించలేక పోయే వీలు లేక పోవడం తో తప్పించుకునేoదుకు ఎస్‌ఐ మరియు పోలీసులు లోపల ఉన్న గదిలోకి వెళ్లి తలుపులు మూసేసారు. దాంతో ఆందోళనకి దిగిన వినోద్ కుటుంభం సభ్యులు లక్ష్మి మృతదేహం చూపే వరకు కదలమని పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు

  •  
  •  
  •  
  •  

Comments