వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయిరెడ్డికి ఈ నెల 17 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. బెయిల్ గడువు ముగియడంతో విజయసాయి బుధవారం కోర్టులో లొంగిపోయారు. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తనను స్పెషల్ బ్యారక్ ను కేటాయించాలని విజయసాయి న్యాయవాదిని కోరారు.
మరోవైపు తాను ధైరాయిడ్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని, మందులు తీసుకువెళ్లేందుకు అనుమతించాలని విజయసాయిరెడ్డి కోరారు. తనకు రిమాండ్ పొడిగించిన ప్రతీసారీ కోర్టుకు హాజరుపర్చాలని న్యాయమూర్తిని కోరారు. ఆయన అభ్యర్ధనను స్వీకరించిన కోర్టు ఈ విషయంలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.