మహిళా జర్నలిస్టులపై పోలీస్ జులుం

Tuesday, September 9th, 2014, 10:13:26 AM IST


తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ ప్రసారాలను నిలిపివేయడాన్ని నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మహిళా జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాగా ప్రజాస్వామ్య బద్దంగా మహిళా జర్నలిస్టులు చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకుమహిళా పోలీసుల చేత బలవంతంగా తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ మహిళా జర్నలిస్టులు ఈ చర్యలను తీవ్రంగా అడ్డుకుంటున్నారు.

ఇక ఈ క్రమంలో పోలీసులకు, జర్నలిస్టులకు మధ్యన ఘర్షణ చోటు చేసుకుని తోపులాట మొదలైంది. ‘పోలీసుల చర్య సిగ్గు సిగ్గు’, ‘పోలీసుల దౌర్జన్యం నశించాలి’, ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ మహిళా జర్నలిస్టులు నినాదాలు చేస్తున్నారు. అలాగే సమాజంలోని లోపాలను వేలెత్తి చూపించే తమపైనే పోలీస్ జులుం ప్రదర్శిస్తారా? అంటూ జర్నలిస్టులు నిలదీస్తున్నారు. ఇక ఈ ఉద్రిక్త వాతావరణంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.