కర్ణాటక ఎన్నికల్లో భారీ నకిలీ నోట్ల స్వాధీనం…

Wednesday, April 18th, 2018, 11:51:11 AM IST

ఎన్ని డీమానిటైజేషన్లు వచ్చినా ఎన్నిసార్లు కొత్త నోట్లు సమాజంలోకి తెచ్చినా ఈ దేశం మారదు అనడానికి కర్ణాటక మరో సారి నిదర్శనం అయ్యింది. అవినీతిని రూపు మాపే లీడర్లు ఇంకా భారత్ లో పుట్టలేదు అని రాష్ట్రం వేలెత్తి చూపుతుంది. ఎలా అంటారా..? కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అక్కడ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బెళగావిలో భారీగా నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. 7 కోట్ల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, రూ. 500ల నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ నోట్లు తరలిస్తున్న ఒక వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న బళ్లారి – అనంతపురం జాతీయ రహదారిపై ప్రయివేటు బస్సులో తరలిస్తున్న రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments