వీడియో : మూడు గంటలు భయపెట్టిన రౌడీ గర్ల్.. చంపేసిన పోలీసులు

Friday, January 5th, 2018, 10:50:47 AM IST

అమెరికాలో నేరస్థులను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు ఎంతో చాక చక్యంగా వ్యవహరిస్తుంటారు. అంతే కాకుండా వారి యూనిఫామ్ కు కెమెరాలను తగిలించుకొని కొన్ని దాడులను అడ్డుకునేందుకు వెళతారు. న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఆ విధానం ఎంతో ఉపయోగపడటమే కాకుండా పోలీసుల ప్రతిభ గురించి కూడా నలుగురికి తెలుస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే అదే తరహాలో ఒక లేడి రౌడీని పోలీసులు పట్టుకోవడానికి వెళ్లగా అక్కడి పరిస్థితులను బట్టి షూట్ చేయాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కెన్సాస్ లో ఉండే సియారా హోవార్డ్ అనే మహిళ గత కొంత కాలంగా నేరాలు చేస్తూ తప్పించుకొని తీరుగుతోంది. అయితే ఫైనల్ గా ఆమెను ఎలాగైనా అరెస్ట్ చేయాలనీ పోలీసులు ఆమె ఉన్న చోటుకు వెళ్లగా.. ఆ యువతి పోలీసులను చూసి గన్ తో బెదిరించి వ్యక్తిగత దూషణకు దిగింది. దీంతో పోలీసులు ఎంత చెప్పినా ఆ యువతి వినిపించుకోకపోవడంతో పోలీసులు షూట్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆమె చనిపోవడంతో అందరి ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు మూడు గంటలపాటు ఆ యువతి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఆ ఘటన మొత్తం పోలీస్ యూనిఫామ్ కు ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.