జగన్ ని ఆపడానికి టికెట్స్ కొని మరీ ప్లాన్ చేసిన పోలీసులు..!

Thursday, February 9th, 2017, 03:55:20 AM IST


వైసీపీఅధినేత జగన్ జనవరి 26 న విశాఖ లో ఆంధ్ర యువత చేపట్టే ప్రత్యేక హోదా శాంతియుత నిరసనలో పాల్గొనడానికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం జగన్ ని పోలీస్ లు ఎయిర్ పోర్ట్ లో అడ్డుకోవడం జగన్ తన అనుచరులతో రన్ వే పైనే నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అక్కడ పెద్ద రసాభాసే జరిగింది. జగన్ పోలీస్ లతో వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా లోకల్ పోలీస్ లకు ఎయిర్ పోర్ట్ లోకి అనుమతి ఉండదు. కేవలం ప్రయాణికులకు తప్ప రన్ వే పైకి వెళ్లే హక్కు మరెవరికి లేదు. లోకల్ పోలీస్ లకు కూడా ఆ హక్కు లేదని తెలుస్తోంది. ఈ విషయం పోలీస్ కమిషనర్ కి ముందే తెలుసనీ అయినా జగన్ ని ఆపడానికి మాస్టర్ పప్లాన్ వేశారని తెలుస్తోంది.

జగన్ ప్రత్యేకహోదా నిరసనలో పాల్గొంటే అల్లర్లు జరుగుతాయని భావించిన కమిషనర్ కొంత మంది పోలీస్ లకు శ్రీలంకన్ ఎయిర్ వేస్ లో మరియు ఇతర ఎయిర్ వేస్ లో కొన్ని టికెట్ లు కొన్నారని సమాచారం. ఆ టికెట్ లు ఉన్న పోలీస్ లను ఎయిర్ పోర్ట్ లోని పార్కింగ్ స్థలం వద్ద ఉంచి జగన్ రాకని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయాలు ఎప్పుడూ కేంద్ర భద్రత బలగాల పహారా లోనే ఉండాలి. లోకల్ పోలీస్ లకు విమానాశ్రయంలోకి అనుమతి ఉండదు. దీనిపై వివరణ ఇవ్వాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు విమానాశ్రయ వర్గాల్ని ఆదేశించారు. ఆరోజు ప్రయాణించిన ప్రయాణికుల జాబితా పంపాలని కోరారు. ఈ విషయం పై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తమకు అందిన సమాచారం ప్రకారం జగన్ ని అడ్డుకోవాలని కేంద్రబలగాలకు ఆరోజు ఎటువంటి కంప్లైంట్ వెళ్లలేదని అన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఆంధ్ర పోలీస్ లు నిబంధనలకు వ్యతిరేకంగానే విమానాశ్రయం లోకి ప్రవేశించారని, అదికూడా పార్కింగ్ ప్రదేశంలోకి వచ్చి జగన్ ని శారీరికంగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.