బిగ్ బ్రేకింగ్ : ప్రశాంత్ కిషోర్ సర్వేపై రాజకీయ వర్గాల్లో సంచలనం.!

Friday, May 17th, 2019, 01:02:00 PM IST

ఇంకా ఎన్నికల ఫలితాలు మరియు ఎగ్జిట్ పోల్స్ సర్వేల యొక్క ఫలితాలు రావడం దగ్గర పడుతుండడంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రతీ ఒక్కరిలోనూ ఉత్కంఠ మరింత పెరిగిపోతుంది.అసలు ఫలితాలు ఎలా వస్తాయో అని కొంత మంది,మరికొంత మంది అయితే ఈసారి ఒకే పార్టీ ఏక పక్షంగా అధికారాన్ని చేపడుతుందని ఒక్కొక్కరు ఒక్కో లెక్కలు వేస్తూ కాలం గడిపేస్తున్నారు.ఇదిలా ఉండగా ఒక్కో పార్టీ వారే వారి పార్టీ గెలుస్తుందా లేదా అని అనేక మార్లు సర్వేలు కూడా చేయించుకుంటున్నారు.

అలాంటి సర్వేలలో ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.గతంలో నరేంద్ర మోడీకి సలహాదారునిగా కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ను జగన్ తన సలహాదారునిగా మరియు వ్యూహకర్తగా నియమించుకున్నారు.అప్పటి నుంచి జగన్ వైఖరిలో మరిన్ని మార్పులు చూపించారు.అదే విధంగా జగన్ పాదయాత్ర మరియు ఎన్నికల అనంతరం ఒక మీటింగులో తన సర్వే ఫలితాలు మరియు జగన్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ పరిచయం కూడా చేసారని వార్తలొచ్చాయి.

వారి సర్వేలో వైసీపీకి ఏకంగా 101 స్థానాలు వస్తాయని తేలిందని కూడా వెల్లడించారు.కానీ ఈ సర్వేను మాత్రం కొంతమంది విశ్లేషకులు తిప్పికొడుతున్నారు.జగన్ ప్రశాంత్ కిషోర్ సర్వేను నమ్ముకుంటే అంతే అని అవన్నీ డబ్బులిచ్చి చేయించిన సర్వేలు తప్ప అందులో ఏమాత్రం నిజం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.మరి పీకే సర్వే లెక్కలు ఏ మేరకు కరెక్ట్ గా ఉంటాయో తెలియాలంటే వచ్చే 23 వరకు ఆగాల్సిందే.