పవన్ పై విమర్శలు స్టార్ట్ చేశారుగా!

Saturday, April 7th, 2018, 09:10:09 PM IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక హోదా పోరు ఊపందుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాదయాత్రతో నిన్న ఒక్కసారిగా జనాలను ఆకర్షించాడు. ఆరు కిలోమీటర్ల వరకు నడిచి తన పోరాట పటిమను చూపాడు. అయితే పవన్ అలా పాదయాత్రను స్టార్ట్ చేశాడో లేదో మరో వైపు నుంచి విమర్శలు రావడం మొదలయ్యాయి. వైఎస్ జగన్ టీడీపీ నుంచి ఘాటైన విమర్శలు వస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా నటుడు శివాజీ కూడా ఇప్పుడు పవన్ పై విమర్శలు చేశాడు.

ప్రత్యేక హోదా అలాగే విభజన హామీలు కోసం పోరాటం చేయాలనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అమరావతిలో అఖిలపక్ష సంఘాల సమావేశలను ప్రారంబించారు. అయితే ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలతో పాటు నటుడు శివాజీ అలాగే సచివాలయ, ప్రభుత్వ, రెవెన్యూ ఉద్యోగ సంఘాలకు సంబందించిన నేతలు హాజరయ్యారు. కానీ ఇతర పార్టీలు మాత్రం హాజరు కాలేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ అలాగే బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలకు హాజరుకావాలని చంద్రబాబు తెలిపినప్పటికీ ఎవరు రాలేదు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకాకపోవడం పై టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నటుడు శివాజీ కూడా పవన్ పై కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన ఎప్పుడు ఈ ఉద్యమంలోకి వచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు. అలాగే ప్రజలను గందరగోళానికి గురి చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇక ఆపరేషన్ గరుడ అనేది నిజమని చెప్పారు.