బాలచందర్ కు ప్రముఖుల నివాళి

Tuesday, December 23rd, 2014, 10:40:00 PM IST

balachandar
ప్రముఖ దర్శకుడు కైలాసం బాలచందర్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. కాగ, 84 సంవత్సరాల బాలచందర్ శరీరం సహకరించకపోవడంతో… ఈ సాయంత్రం 7:05 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారులు తెలిపారు. 101 చిత్రాలకు బాలచందర్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్, కమల్ హాసన్ కు బాలచందర్ సినీగురువు. తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన అంతులేని కధ, మరోచరిత్ర, ఆకలిరాజ్యం, రుద్రవీణ వంటి ఎన్ని గొప్ప సినిమాలు తీసిన దర్శకుడు కె బాలచందర్. ఇక ఆయన మృతి పట్ల ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సంతాపాన్ని తెలిపారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంతాపం తెలిపారు. అటు తమిళనాడు గవర్నర్ కె రోశయ్య తన సంతాపాన్ని తెలిపారు.