అధికారుల అండతోనే కొండలను తవ్వి దోచేస్తున్నారు..!

Friday, October 12th, 2018, 01:00:43 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు బలంగా విమర్శించే అంశాలలో ఇసుక అక్రమ రవాణా మరియు అక్రమ క్వారీ తవ్వకాలు.ఈ రెండు సమస్యలను బలంగా వినిపిస్తుంటారు.అయితే తాజాగా గుంటూరు జిల్లా పేరేచెర్ల గ్రామంలోని అక్కడి అధికారుల అండదండలతోనే అక్రమ మైనింగ్ కి పాల్పడుతున్నారని,అక్కడి గ్రామస్థులు వాపోతున్నారు.అక్కడి తవ్వకాలు మరియు బాంబు పేలుళ్లకు గాను విపరీతమైన దుమ్ము ధూళి చేరుకుంటుంది అని తమ బాధని వెళ్లగక్కుకుంటున్నా తమని పట్టించుకునే నాధుడు ఒక్కడు కూడా లేడని వాపోతున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకు కేవలం 10 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి గ్రానెట్ కొండలు అక్కడి ప్రజల పాలిట శాపంగా మారిందని అంటున్నారు.అక్కడి మైనింగ్ అధికారులు పరిమితులకు మించి అక్రమంగా కొండలను తవ్వి దోచుకెళ్లిపోతన్నారు.అక్కడి పేలుళ్ల వల్ల ఏ బండలు వారి ఇళ్ళల్ల మీద పడతాయో అని అక్కడి గ్రామస్థులు భయపడుతున్నారు.అంతేకాకుండా అక్కడి మట్టితో కూడిన కంకర రాళ్లను లారీల్లో తరలిస్తుండగా పెద్ద ఎత్తున దుమ్ము,ధూళి చేరుకొని గాలి కలుషితం కావడంతో ప్రజలు శ్వాస తీసుకోవాడనికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అక్కడి గ్రామస్థులు అధికారులకు మరియు రాజకీయ నాయకులకు పిర్యాదు చేసినా వారిని ఎవరు పట్టించుకోవట్లేదని,దానికి తోడు అక్కడి అధికారులు మరియు రాజకీయ నాయకులు లంచాలకు అలవాటు పడిపోయి ఈ అక్రమాలను ఇంకా ప్రోత్సహిస్తున్నారు.