పొలిటిక‌ల్ సెటైర్స్ : ఇంత తిడుతున్నారు..ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేకుంటే అధికారం వ‌చ్చేదా చంద్ర‌బాబూ!

Tuesday, August 30th, 2016, 05:52:43 PM IST


ఎల్ల‌య్య : మొత్తానికి తిరుప‌తిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాగానే మాట్లాడాడ్రా పుల్ల‌య్య !
పుల్ల‌య్య : కొన్ని అర్ధం కాకున్నా ఏదో ఫ‌ర్వాలేదు. ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ క‌న్నా ఇంకో దిక్కులేదు క‌దా?
ఎల్ల‌య్య : అదేంట్రా..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టీడీపీ నాయ‌కులు అలా తిడుతున్నారు.! ఆయ‌నేం త‌ప్పు మాట్లాడాడ్రా ?
పుల్ల‌య్య : ఎవ‌రైనా త‌మ‌కు వ్య‌తిరేకంగా మ‌ట్లాడితే వాళ్ల‌ను తిట్ట‌డం పార్టీల‌కు కామ‌న్ రా.. అదీ కేసీఆర్ అయినా చంద్ర‌బాబు అయినా..!
ఎల్ల‌య్య : మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మావోడో అన్న టీడీపీ నాయ‌కులు..అత‌నో కుర్ర‌కుంక, ఆవేశం ఎక్కువ అని మాట్లాడుతున్నారు!
పుల్ల‌య్య : అదేరా రాజ‌కీయం అంటే..వాళ్ల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడినోళ్లు అంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లేరా!
ఎల్ల‌య్య : మొన్న‌టి వ‌ర‌కూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను హీరో, సూప‌ర్ అని తెగ ఎత్తేశారు క‌దా?
పుల్ల‌య్య : రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎత్తేయాలో ఎప్పుడు కింద‌కు ప‌డేయాలో తెలిసుండాలి రా..
ఎల్ల‌య్య : ఓరే నాకు తెలీక అడుగుతాను మొన్న ఎల‌క్ష‌న్స్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేకుంటే చంద్ర‌బాబు గారు సీఎం అయ్యేవారా?
పుల్ల‌య్య : మ‌రీ అలా అంటే బాబుగారికి కోపం వ‌స్తుందిరా బాబు..సొంత గొప్ప‌త‌నం వ‌ల్ల‌నే ఆయ‌న సీఎం అయ్యాడు!
ఎల్ల‌య్య : ఏమోరా బాబు నాకైతే ప‌వ‌న్ బాగా వాడుకుని ఇప్పుడు ఆడుకుంటున్న‌ట్టు అనిపిస్తోంది!
పుల్ల‌య్య : ఏవ‌ర్ని ఎంత‌వ‌ర‌కూ వాడుకోవాలో..వాళ్ల‌ను ఎక్క‌డ కుదేసి కుళ్ల‌బొడ‌వాలో బాబు గారికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెల్వ‌దు!