హీటెక్కుతున్న నంద్యాల పొలిటికల్ వార్ !

Tuesday, November 22nd, 2016, 03:45:24 AM IST

bhooma-nagi-reddy
నంద్యాలలో రెండు బిగ్ పొలిటికల్ పర్సనాలిటీస్ అయినా భూమా నాగిరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి ల ఆమధ్య పొలిటికల్ వార్ తగ్గకపోగా హెచ్చుతోంది. గతంలో భూమా వైసీపీలో ఉన్నప్పుడు తారా స్థాయిలో ఉన్న ఈ గొడవలు భూమా మరల టీడీపీ తీర్థం పుచ్చుకోగానే తగ్గుముఖం పడతాయని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ఎజెండాగా వెరీ మధ్య సయోధ్య కుదిర్చే యత్నం చేశారు. ఇద్దర్నీ దగ్గర కూర్చోబెట్టుకుని పరస్పరం మాట్లాడి సర్దుబాటు చేశారు. కొన్నాళ్ళు బాబు ప్రయత్నం ఫలించింది.

కానీ మళ్ళీ కొన్నాళ్ళకు జన చైతన్య యాత్ర వేదికగా ఇద్దరు నేతలు పరస్పర వాదనకు దిగారు. శిల్ప మోహన్ రెడ్డి ‘నువ్వు ఏయే దందాలు చేస్తున్నావో బయటపెడతానని, ప్రభుత్వ నిధులు ఏ పథకాలకు ఎలా ఖర్చు చేసింది లెక్కలు చెప్పాలని భూమా నాగిరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒకే పార్టీలో ఉన్న కథ మళ్ళీ మొదటికొచ్చినట్టే అయింది. ఈ నైపథ్యంలో తాజాగా భూమా శిల్పా రెడ్డిని ఉద్దేశించి నన్ను అరెస్టు చేయించడం నీ తరం కాదని, ఇప్పటికి నువ్వు నియోజక వర్గానికి కనీసం ఐదు ఇల్లు కూడా తేలేకపోయావని, నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో గొడవలు మరింత వేడెక్కాయి. దీన్ని ఎలా పరిష్కరించాలో తెలియక బాబు తలనొప్పి మొదలైంది.