పోల్ : పవన్ వ్యక్తిత్వంపై దాడి వెనుక ఏ పార్టీ ఉందని మీరు భావిస్తున్నారు..?

Saturday, April 21st, 2018, 07:03:57 PM IST

భాద్యత గల పౌరునిగా నీ సమాధానం తప్పనిసరి

గత కొద్దిరోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై, అతని తల్లి పై సంచలన నటి శ్రీ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ విషయమై కొన్ని మీడియా చానల్లు, ప్రత్యేకంగా షోలు నడిపిస్తూ సినీ రంగం, రాజకీయ రంగం ప్రముఖులతో ఇంటర్వ్యులు చేస్తూ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై మా అసోసియేషన్ కూడా కాస్త ఎక్కువగానే శ్రద్ధ తీస్కోని చర్చలు చేస్తుంది. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ గురువారం రాత్రి నుండి పవన్ తన ట్విట్టర్ నుండి అటు మీడియాపై ఇటు రాజకీయ పార్టీలపై అతనికి జరిగిన అన్యాయంపై విరుచుకుపడుతూ ట్వీట్లు చేస్తున్నాడు. శుక్రవారం ఫిలిం చాంబర్ కు కూడా వెళ్లి 24 గంటల్లో తనకు తగిన న్యాయం చేయాలని లేదంటే తగిన చర్యలు తీస్కుంటానని హెచ్చరించడం జరిగింది. ఈ వివాదాల వెనుక ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉండి, శ్రీ రెడ్డిని, మహేష్ కత్తిని పెట్టి ఆయన్ని గత 8 నెలలుగా వేదిస్తున్నారని వీళ్ళకి తోడుగా కొన్ని మీడియా చానళ్ళు కూడా కాపు కాస్తున్నాయని ఆయన అన్నారు. మరోవైపు రాజకీయంగా పీడించడానికి వైఎస్ఆర్సీపీ , టీడీపీ లి కూడా ఆయన్ని వేదిస్తున్నాయన్నాడు. కానీ ఇప్పటికీ కూడా ఆయనను అణగదొక్కడానికి ఏ పార్టీ వీటన్నిటి వెనుక ఉండి ఇవన్నీ చేయిస్తుందా అని మాత్రం పక్కాగా తెలియడం లేదు. కొందరు రాజకీయ విశ్లేషకుల సమాచారం ప్రకారం టీడీపీ మాత్రమే కాకుండా మరో వైపు వైఎస్ఆర్సిపీ హస్తం కూడా ఉందని సమాచారం. కానీ అసలు నిజం మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. అంతే కాకుండా పవన్ తన ట్విట్టర్ లో చంద్రబాబు పుట్టిన రోజున ఏపీ రాజధాని అయిన అమరావతిలో ధర్మ పోరాట సభ జరుగుతున్న సమయంలో చంద్రబాబుపై మరియు మంత్రి నారా లోకేష్ పైన కూడా ట్వీట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఇదిలా ఉంటే అటు పవన్, చంద్రబాబు, జగన్, ఎలాంటి నిర్ణయం తీస్కుంటారో అని జనం ఆలోచిస్తుంటే ఇటు మీడియా కూడా ఎప్పుడు ఎలాంటి పిడి బాంబులు వేస్తుందా అని ఆలోచన. ఏదేమైనా ఈ విషయమై రాజకీయ సినీ అభిమానులైన ప్రతీ పౌరుడు మీ ఓటు వేయండి. చూద్దాం జనం ఏమని ఆలోచిస్తున్నారో అని.

  •  
  •  
  •  
  •  

Comments