టి 20 ల్లో పొలార్డ్ నయా రికార్డ్!

Thursday, January 25th, 2018, 04:24:55 PM IST


వెస్ట్ ఇండీస్ ఆటగాడు కీరాన్ పొలార్డ్ టీ 20 ల్లో ఒక అత్యుత్తమ రికార్డును సాధించారు. నిజానికి ఈ రికార్డ్ పరుగులు సాధించడం లో కాదు. ఆయన ఇప్పటివరకు ఏ ఆటగాడు ఆడనన్ని టి 20 లు ఆడి రికార్డ్ నెలకొల్పాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆయన ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియా లో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఆయన మెల్బోర్న్ రేనీగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీనిలో భాగం గా సోమవారం ఆడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన మ్యాచ్ ఆయనను 400 టి 20 మెయిలు రాయిని అందించింది. కాగా బుధవారం సిడ్నీ థండర్స్ తో ఆడిన మ్యాచ్ ఆయనకు 401 వ మ్యాచ్ గా నిలిచింది. తర్వాతి స్థానాల్లో బ్రేవో 372, క్రిస్ గేల్ 323 మ్యాచ్ లు ఆడారు. ఇప్పటివరకు పోలార్డ్ 401 మ్యాచ్ ల్లో 361 ఇన్నింగ్స్ ఆడి 7,853 పరుగులు సాధించారు. అలానే బౌలర్ గా 274 ఇన్నింగ్స్లో 245 వికెట్లు పడగొట్టారు. మొత్తంగా ఆయన ఆడుతున్న జట్లు చూస్తే మెల్బోర్న్ రేనీగేడ్స్, బార్బొడాస్ ట్రిడెంట్స్ అండ్ ట్రినిడాడ్ టొబాగో, కేప్ కోబ్రాస్, ఢాకా డైనమైట్స్, ముంబై ఇండియన్స్, ఢాకా గ్లాడియేటర్స్, కరాచీ కింగ్స్, సోమర్ సెట్ అండ్ సౌత్ ఆస్ట్రేలియా మొదలగునవి ఆయన ఆడుతున్న టి 20 జట్లు….