చికాగో రాకెట్ ఇష్యూ లో కొత్త మలుపు .. వాళ్లిదరు భార్య భర్తలు కాదట ?

Friday, June 29th, 2018, 01:14:55 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న చికాగో రాకెట్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు మోదుగుముడి కిషన్ అతని భార్య చంద్రలను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ వ్యవహారం పై తాజగా తెలుగు భామ పూనమ్ కౌర్ స్పందించింది. అసలు కిషన్ – చంద్ర భార్య భర్తలు కాదని లగ్జరీ లైఫ్ కోసం ఇద్దరు అలా నటిస్తున్నారంటూ కామెంట్ చేసింది. ఓ సందర్బంగా తాను అమెరికా వెళ్ళినప్పుడు తాను బస చేసిన ఓ హోటల్ దగ్గరికి కిషన్, చంద్ర లతో కలిసి ఓ వ్యక్తి వచ్చాడని .. అతను అర్ధరాత్రి తలుపు తట్టి విచిత్రంగా ప్రవర్తించాడని. తన తీరుతో కోపం వచ్చి చెంప పగులగొట్టానని చెప్పింది. అమెరికాలో ఇండియన్ హీరోయిన్స్ విషయంలో డబ్బు ఆశ చూపో. లేక బయపెట్టో లొంగదీసుకుంటారని చెప్పింది. ఇలా మోసపోతున్న అమ్మాయిలను కాపాడాలని ఆమె కోరింది.