అప్పు తిరిగివ్వలేదని నా భార్యను తీసుకెళ్లాడు!

Tuesday, July 24th, 2018, 05:09:45 PM IST

వడ్డీలకు అప్పించి దానికి చక్ర వడ్డీలను కలిపి అమాయకులను మోసం చేయడం ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. డబ్బు ఇవ్వకుంటే ఎంతకైనా తెగించడానికి సిద్దపడుతున్నారు. ఇంట్లో ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలు నిత్యం వార్తల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా మంచిర్యాలలో ఒక కుటుంబపై ఒక వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదని ఇంట్లో భార్యతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

అసలు వివరాల్లోకి వెళితే.. నెన్నెల మండలం ఆవడం గ్రామనికి చెందిన బాసవేన హనుమంతు అనే వ్యక్తి ట్రాక్టర్ నడుపుతూ భార్యని ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్నాడు. అయితే కొన్ని నెలల క్రితం ఆరోగ్యం దెబ్బతినడంతో చిత్తపూర్‌కు చెందిన సంధాని అనే వ్యక్తి వద్ద రూ.20 వేలు అప్పుచేసినట్లు బాధితుడు తెలిపాడు. అయితే ఆ డబ్బుకోసం రోజు ఇంటికి వచ్చి తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని దీంతో ఆ విషయం తెలియగానే భార్య పిల్లలతో మందమర్రి ప్రాంతానికి వెళ్లి అక్కడ జీవనం కొనసాగిస్తున్నట్లు వివరణ ఇచ్చారు.

అయితే అక్కడికి వచ్చిన సంధాని నేను లేని సమయంలో పిల్లలను భార్యను తీసుకెళ్లాడని డబ్బు తిరిగి ఇస్తేనే భార్య పిల్లల్ని తనకు అప్పగిస్తానని బెదిరించినట్లు బాధితుడు వాబోయాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించగా నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు
సిద్ధమయ్యారు.

  •  
  •  
  •  
  •  

Comments