పాప్ సింగర్ మరణంపై అనుమానాలు?

Saturday, April 21st, 2018, 03:03:51 PM IST

తన మ్యూజిక్ తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ పాప్ సింగర్ అవిసీ హతన్మరణం ప్రస్తుతం సంచంలనంగా మారింది. ఆ ఘటనపై ఎన్నో అనుమానాలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. అవిసీ మరణం వెనుక కారణాలు తెలుపాలని, ఏదైనా కుట్ర జరిగి ఉంటుందని అభిమానులు సన్నిహితులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబందించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అవిసీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ప్రపంచంలోనే పెరిగాడు. పాప్ సింగర్ గా అతితక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకున్నాడు. వేక్ మీ అప్ అనే సాంగ్‌ తో అవిసీ కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. అలాగే లెవల్స్ , అండ్ రీసెంట్లీ, లోన్లీ టుగెదర్ ఆల్బమ్‌లతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు అందుకున్నాడు. అయితే అంతటి గొప్ప పాప్ సింగర్ యుక్త వయసులో(28) మృతి చెందడం అందరిని షాక్ కి గురి చేసింది. శుక్రవారం ఒమన్‌ లో అవిసీ మృతి చెందినట్లు బరోన్‌ పేరు మీద ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇకపోతే నికోటిన్‌కు బానిసై రోగాల బారిన పడి చనిపోయి ఉండవచ్చని ఎక్కువగా టాక్ వినిపిస్తోంది. 2013లోనే అతనికి రోగాలు ఉన్నాయని రూమర్స్ రావడంతో అవిసీ ఆ విషయాలను ఖండించాడు. ఇక 2014లో వరుసగా పెద్ద షోలను ఊహించని విధంగా రద్దు చేసుకోవడంపై కూడా పలు అనుమానాలు వచ్చాయి. అతనే ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వివరించాడు. అతను ఎలా చనిపోయాడు అనే విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments