విదేశాల్లో వ్యభిచారం.. ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్ అరెస్ట్‌..!

Friday, November 16th, 2018, 01:15:19 PM IST

విదేశాల‌కు అమ్మాయిల‌ను తీసుకెళ్ళి వ్య‌భిచారం చేయిస్తున్న ప్ర‌ముఖ డ్యాన్స్ మాస్ట‌ర్‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బాలీవుడ్ నృత్య ద‌ర్శ‌కురాలు అయిన అగ్నేస్ హమిల్టన్.. అందేరీలోని లోఖండ్‌వాలా స‌మీపంలో బాలీవుడ్ హ‌బ్ పేరిట డ్యాన్స్ స్కూల్ నిర్వ‌హిస్తున్నారు. ఇక బాలీవుడ్‌లో పలు చిత్రాల‌కు కొరియోగ్రాఫ్ చేసిన అగ్నేస్.. విదేశాల్లో కూడా డ్యాన్స్ షోలు చేస్తూ అక్క‌డ మంచి ప‌రిచ‌యాలు ఏర్ప‌రచుకున్నారు.

అయితే తాజాగా కెన్యాలో డ్యాన్స్ షోకోసం వ‌చ్చిన ఒక యువ‌తి, అక్క‌డ‌ ఒక హోట‌ర్‌లో వ్య‌భిచారం చేస్తూ ప‌ట్టుబ‌డింది. దీంతో ఆ యువ‌తిని అరెస్టు చేసిన పోలీసులు విచారించ‌గా.. అగ్నేస్ హామిల్ట‌న్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంతేకాకుండా ఆమె పంపించే ఒక్కో యువ‌తికి 40 వేలు తీసుకుంటుంద‌ని.. మ‌లేషియా, దుబాయ్, కెన్యా, బ‌హ్రెయిన్, త‌దిత‌ర దేశాల‌కు అమ్మాయిల్ని స‌ప్లై చేస్తుంద‌ని పట్టుబ‌డిన యువ‌తి చెప్పింది. దీంతో అక్క‌డి వారు ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు స‌మాచారం ఇవ్వ‌గా ఆగ్నేస్ హామిల్ట‌న్‌ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.