యండ‌మూరికి సంస్కారం ఉందా? .. పోసాని తిట్లు!

Monday, February 13th, 2017, 11:22:47 AM IST


మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ రూపురేఖ‌ల‌పై ఓ వ్య‌క్తిత్వ వికాస త‌ర‌గ‌తిలో యండ‌మూరి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే యండ‌మూరి అంత కుసంస్కారంగా కామెంట్ చేసినా నాడు మెగా ఫ్యామిలీ స్పందించిందే లేదు. అయితే త‌మ బిడ్డ‌పై యండ‌మూరి విషం క‌క్క‌డంపై చాలా బాధప‌డ్డార‌న్న సంగ‌తి మొన్న‌టిరోజున ఖైదీ ఈవెంట్‌లో నాగ‌బాబు ఫైర్ అయిన తీరును బ‌ట్టి అర్థం చేసుకున్నారు ప్ర‌జ‌లు. అటుపై ఓ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలోనూ మెగాస్టార్ స్వ‌యంగా యండ‌మూరి కుసంస్కారి అని వ్యాఖ్యానించారు. ఎవ‌రి బిడ్డ గురించి అంటే ఎవ‌రు ఊరుకుంటారు?

నాడు యండ‌మూరి కామెంట్‌పై మీరెలా స్పందిస్తారు? అని ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌, న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళిని ఓ టీవీ హోస్ట్ అడిగిన‌ప్పుడు ఆయ‌న చాలా ఆవేశంగా స్పందించారు. అదే నా బిడ్డ‌ను అని ఉంటే అస్స‌లు వ‌దిలిపెట్టేవాడిని కాను. మెగా స్టార్ మంచోడు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మంచోడు. నాగ‌బాబు మంచోడు. అందువ‌ల్ల‌నే వ‌దిలేశారు కానీ… అయినా 50 కోట్ల వ‌సూళ్లు సునాయాసంగా తెచ్చేంత ఫాలోయింగ్ ఉన్న స్టార్‌ని ప‌ట్టుకుని అలాంటి కామెంట్లు చేస్తాడా? య‌ండ‌మూరికి సంస్కారం ఉందా? అంటూ పోసాని తిట్టిపోశారు. యండ‌మూరి- చ‌ర‌ణ్ ఎపిసోడ్ రోజురోజుకు రాజుకుంటూ ఎటో వెళుతోంది. దీనికి ఇప్ప‌ట్లో ఫుల్ స్టాప్ ప‌డ‌దంటారా?