జ‌గ‌న్ పై దాడి.. లైవ్‌లోకి పోసాని వ‌చ్చాడు.. అంద‌రికీ ఇచ్చాడు..!

Friday, October 26th, 2018, 03:46:55 PM IST

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి పై తాజాగా విశాఖ‌ప‌ట్నం ఎయిర్‌పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దాడిలో భాగంగా భుజానికి గాయ‌మ‌వ‌డంతో అక్క‌డ ప్ర‌థ‌మ చికిత్స చేయించుకుని హైద‌రాబ‌ద్ వ‌చ్చి ప్ర‌ముఖ న్యూరో ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకుని ఈ రోజు డిస్చార్ట్ అయ్యారు. అయితే ఇక్క‌డ అస‌లు విష‌యం ఏంటంటే,జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే ఖండించాల్సింది పోయి.. నాట‌కాలు ఆడుతున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంద‌రు జ‌గ‌న్ పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అయితే ఈ నేప‌ధ్యంలో తాజాగా సినీర‌చ‌యిత, న‌టుడు, ద‌ర్శ‌కుడు అయిన పోసాని ముర‌ళీకృష్ణ స్పందించారు. ప్ర‌తిప‌క్ష అధినేత జ‌గ‌న్ పై దాడి జ‌రిగితే టీడీపీ నేత‌ల‌కి చాలా కామెడీగా ఉంద‌ని.. దాడి జ‌రిగి ఆస్ప‌త్రిలో చేరితే.. డ్రామాలు ఆడుతున్నాడ‌ని విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని.. దీంతో టీడీపీ నేత‌ల‌కు క‌నీసం మాన‌వత్వం కూడా లేకుండా పోయింద‌ని పోసాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక చంద్ర‌బాబు గ‌రుడవేగ పై చేసిన వ్యాఖ్య‌ల పై స్పందిస్తూ.. త‌న‌కు కూడా రాజ‌ధాని ఢిల్లీ నుండి కాల్ వ‌చ్చింద‌ని.. ఆ ఫోన్ చేసింది మాత్రం ప‌ప్పు అని.. అత‌ను ఏం చెప్పాడంటే.. అది ఆప‌రేష‌న్ గ‌రుడ కాదు.. ఆప‌రేష‌న్ వెర్రి పువ్వు అని అన్నాడ‌ని పోసాని అన్నారు. మీ ఇంటెన్ష‌న్ చూస్తుంటే.. జ‌గ‌న్ ఉంటే జైలులో ఉండాల‌ని లేకుంటే ఈ భూమి మీదే ఉండ కూడ‌ద‌ని భావిస్తున్నార‌ని టీడీపీ శ్రేణుల పై పోసాని ద్వ‌జ‌మెత్తారు. మ‌రి పోసాని వ్యాఖ్య‌ల పై టీడీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments