పదవుల వేలం – ఈసీ పోలీస్ కంప్లైంట్

Thursday, January 10th, 2019, 05:00:26 PM IST

తెలంగాణ లో జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పదవులు వేలం వేసుకున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పొలిసు శాఖ కి కంప్లైంట్ చేసింది. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోని, తగిన చర్యలు కూడా తీసుకోవాలని పొలిసు శాఖ ని కోరింది. ఈ మేరకు ఎస్ఈసీ డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాసింది. వికారాబాద్ జిల్లా బోజ్యానాయక్ తండాలో వేలం ఉదంతాన్ని ప్రస్తావించిన ఎన్నికల సంఘం, రాస్త్రమోనియాన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని లేఖలో పేర్కొన్నారు.

దాదాపుగా అన్ని జిల్లాలలోఇలాగే జరుగుతుందని, అందరు మూకుమ్మడిగానే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఈసీ అన్నారు. అంతేకాకుండా ఇలా ఎన్నికలలో పదవులను వేలం వేయడంవలన నీతిలేని రాజకోట నాయకులూ వస్తారని, వారివలన మనకు ఎలాంటి మంచి పనులు జరగవని ప్రజలకు తెలిపారు. పదవులు వేలం వేసినా, అక్రమాలకు పాల్పడినా,ప్రభావితం చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని ఎన్నికల సంఘం సంఘం హెచ్చరించింది. ఈ మేరకు అన్ని జిల్లాల పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డిజిపి మహేందర్ రెడ్డికి సూచించింది.