సంక్రాతి సిత్రాలు: మూడు ఫ్లాప్స్ డిక్లేర్డ్ – మరీ ఎఫ్2 ..?

Friday, January 11th, 2019, 12:40:33 PM IST

టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సంక్రాతి రానే వచ్చింది, అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎన్నో అంచనాలు పెట్టుకున్న పెద్ద సినిమాలు కూడా వచ్చేసాయి. ఈ సినిమాల్లో మొదటగా చెప్పుకోవాల్సింది “ఎన్టీఆర్” బయోపిక్ గురించి, నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ, ప్రతిష్టాత్మకంగా స్వయంగా సొంత సొంత బ్యానర్ నిర్మించారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి, ఎన్టీఆర్ బయోపిక్ కావటంతో ఆయన జీవితం తాలూకు ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకోవచ్చన్న ఉత్కంఠతో ఎదురు చూసారు ప్రేక్షకులు, తీరా సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది సినిమాను ఒక భాగంగా కాకుండా సినీ రంగ విశేషాలను కథానాయకుడుగాను, రాజకీయ రంగానికి సంబందించిన విశేషాలను మహానాయకుడు విడుదల చేయటానికి ప్లాన్ చేసారు. మొదటి భాగం కధానాయకుడు విడుదలవగా అందులో ప్రేక్షకులు ఊహించినట్టుగా ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితంలోని ఎవరికీ తెలియని అంశాలు లేకపోగా ఎన్టీఆర్ సినిమాల్లోని గెటప్పులు చూపటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. అందులోను యంగ్ ఎన్టీఆర్ రోల్ లో బాలకృష్ణను చూడటం ఇబ్బందికరంగా ఉన్నిందని, జూనియర్ ఎన్టీఆర్ అయ్యుంటే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయావాడని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాలయ్య గత సినిమాలు పైసా వసూల్, గౌతమి పుత్ర శాతకర్ణి కంటే తక్కువగా 7.60 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.

బాలకృష్ణ నిరాశ పర్చటంతో వినయ విధేయ రామగా వచ్చిన రాంచరణ్ అయినా ఆకట్టుకుంటాడని అందరూ అనుకున్నారు కానీ, ఆ ఆశలపై బోయపాటి నీళ్లు చల్లారు. సినిమా కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవటంతో తొలి ఆటతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది ఈ సినిమా. మాస్, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండటంతో బి,సి సెంటర్లలో ప్రేక్షకులకు మాత్రమే నచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మిగిలింది వెంకటేష్ వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2, మొదటి నుండి ఈ సినిమా మీద పెద్దగా అంచనాలు లేవు కానీ, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక కామెడీ, ఫామిలీ డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్టు అనిపించటంతో ప్రేక్షకులకు ఈ సినిమా మీద కూడా హోప్స్ పెరిగాయి, ఇప్పటికే వచ్చిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవటంతో ఇక అందరి చూపు ఎఫ్2 మీదనే ఉంది. సంక్రాతి సెలవులు ఉండటం, ఫామిలీ డ్రామా బేస్డ్ సినిమా కావటంతో రేసులో ముందుండే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు, వెంకీ మార్క్ కామెడీ, అనిల్ రావిపూడి కమర్షియాలిటీ వర్కౌట్ అయితే గనక సినిమా కచ్చితంగా మంచి హిట్ అవుతుందని అంటున్నారు. మొత్తం మీద అంతరిక్షం లాంటి డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కు, గురు తర్వాత చాల గ్యాప్ తీసుకున్న వెంకటేష్ కు, రాజా ది గ్రేట్ లాంటి హిట్ తో ఊపు మీదున్న అనిల్ రావిపూడి ఈ సారి హిట్ ఖాయమయ్యే లాగే ఉంది.