చంద్రబాబు గారూ.. అవునా..? కాదా..?

Friday, January 12th, 2018, 12:20:44 AM IST

పోలవరం విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవ నాడిగా, సెంటిమెంట్ గా మారిన సంగతి తెలిసిందే. ఏపీ పిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి పోలవరం ప్రాజెక్ట్ కోసం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు బహిరంగ లేఖ ద్వారా సూటి ప్రశ్నలు సంధించారు. తాను సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తమ పాదయాత్రపై విష ప్రచారం చేయడం దారుణం, అనైతికం అని రఘువీరా అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్ వ్యయం కేవలం చంద్రబాబు వల్లే పెరిగిపోయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టులని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూశారు. దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది. ఇది నిజమా కాదా ? 16 వేల కోట్లు మాత్రమే ఉన్న పోలవరం ప్రాజెక్ట్ వ్యయాన్ని చంద్రబాబే 58 వేల కోట్లకు పెంచేశారు. ఈ విషయంలో చంద్రబాబు కేంద్రానికి లెక్కలు చూపారు. ఆ లెక్కల్లో తేడా ఉండడంతో కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించలేదు..ఇది నిజమా కాదా ? అంటూ ప్రశ్నలు సంధించారు. పోలవరం ప్రాజెక్ట్ రెండడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి పడుతుండడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments