“సాహో” ట్రైలర్ విడుదల ముందు..జపాన్ లో అడుగుపెట్టనున్న ప్రభాస్..!?

Wednesday, December 5th, 2018, 09:59:37 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “బాహుబలి” చిత్రాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగిన నటునిగా మారిపోయారు. ఆ మధ్య బాహుబలి 2 చిత్రాన్ని జపాన్ దేశంలో విడుదల చేసినపుడు అక్కడి ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరించారో అందరికి తెలుసు.అంతే కాకుండా అక్కడి ప్రేక్షకులకు కూడా ప్రభాస్ విపరీతంగా నచ్చేసాడు.దీనితో అక్కడ ప్రభాస్ కు అక్కడ విగ్రహాలే చేసేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ తన తర్వాతి భారీ ప్రాజెక్ట్ “సాహో” చిత్రంతో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు ప్రభాస్ ను ఎలా అయినా చూడాలని జపాన్ లో ఉన్న అభిమానులు అనుకుంటున్నారట,ఈ వార్త ఎలాగో తెలుసుకున్నటువంటి ప్రభాస్ మరియు సాహో టీమ్ అంతా కలిసి అక్కడ జపాన్ లో ఉన్న అభిమానులు అందరిని కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారట.అది కూడా సాహో చిత్రం యొక్క ట్రైలర్ విడుదలకు ముందే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈ చిత్రంపై సంబంధించి 65 శాతం వరకు షూటింగ్ పూర్తయ్యినట్టు సమాచారం.