సాహో ని నెట్టేసిన ప్రభాస్ తరువాతి సినిమా

Saturday, May 18th, 2019, 03:28:58 AM IST

బాహుబలి లాంటి చిత్రాల తరువాత ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. బాహుబలి సినిమాలకి చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ప్రస్తుతానికి సినిమాల జోరు పెంచాడనే చెప్పాలి. అయితే ఒకే సారి రెండు సినిమాలు చేస్తూ ప్రభాస్ ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు. ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. దానితో పాటే జాన్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్. ఈ రెండు చిత్రాలను కూడా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు…

అయితే ఇక సాహో లాంటి ఫుల్ యాక్షన్ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో రానున్న జిల్ చిత్రం ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. 1970 కాలంలో సాగే ఉద్విగ్నభరితమైన ప్రేమకథా సినిమాగా ఉంటుందన్న సమాచారం. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ గానే తెరకెక్కుతుంది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు మాత్రం యూరప్ లో తెరకెక్కించాల్సి ఉంది. అది కష్టతరమని తెలుసుకున్న చిత్ర బృందం హైదరాబాద్ శివార్లలో యూరప్ వాతావరణాన్ని తలపించేలా రూ.30 కోట్లతో భారీ సెట్ వేశారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయికగా నటిస్తుంది. దీన్ని బట్టి చూస్తే సాహో కంటే జాన్ సినిమానే ఎక్కువ మార్కెట్ చేసేలా ఉందని దర్శక నిర్మాతలు అంటున్నారు.