“సాహో” ప్రీ లుక్ తో షాక్ ఇచ్చిన ప్రభాస్..!

Monday, October 22nd, 2018, 04:34:19 PM IST

టాలీవుడ్ బాహుబలి,అమ్మాయిల కలల రాకుమారుడు,అభిమానులు ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే “యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్” యొక్క పుట్టిన రోజు రేపు అనగా ఈ అతను చేస్తున్న “సాహో” చిత్రం యొక్క ప్రీ లుక్ ని వదిలి అతని అభినానులను ఆశ్చర్యానికి గురి చేసాడు.బాహుబలి చిత్రంతో యావత్తు ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నటువంటి ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడు అయ్యిపోయాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఆ చిత్రాల తర్వాత “రన్ రాజా రన్” ఫేమ్ సుజిత్ తో ఎప్పుడో మొదలు పెట్టినటువంటి సాహో చిత్రం ఈ పాటికే విడుదలయ్యిపోవాల్సి ఉంది కానీ కొని కారణాల వల్ల చిత్రం ఆలస్యమయింది.

దానికి తోడు అసలు వారి చిత్ర యూనిట్ నుంచి కూడా పెద్దగా అసలు ఎలాంటి సమాచారం కూడా రాకపోవడంతో డార్లింగ్ యొక్క అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.ఈ సారి ప్రభాస్ యొక్క పుట్టిన రోజు నాడు అయినా సరే ఏదొక అప్డేట్ ఇస్తారని అభిమానులు ఎంత గానో ఆశిస్తుండగా గత కొద్ది రోజులు క్రితం ప్రభాస్ తన పేస్ బుక్ ద్వారా ఈ సరి తన పుట్టిన రోజున తన అభిమానులకు ఒక బహుమతి ఇస్తున్నాని తెలుపగా అతని అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు.అయితే ఆ ఆనందాన్ని ఆశ్చర్యం ప్రభాస్ అండ్ టీం మార్చేశారు.సాహో నుంచి ప్రభాస్ యొక్క ఒక ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసి అభిమానులను ఒక్కసారిగా ఆశ్చర్య పరిచారు.ఇప్పుడు ఈ పోస్టర్ ని చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఈ పోస్టర్ని గమనించగా రేపు ప్రభాస్ పుట్టిన రోజున కూడా ఉదయం 11 గంటలకు ఇంకేదో కూడా ఉంది అన్నట్టు ఆ పోస్టర్ లో ఉంది.వేచి చూద్దాం ప్రభాస్ ఇంకేం ఇచ్చి ఆశ్చర్యపరుస్తాడో…..

  •  
  •  
  •  
  •  

Comments