సుధీర్ పెళ్లిపై ప్రదీప్ పంచుల ప్రవాహం..

Thursday, March 7th, 2019, 04:40:08 PM IST

ఇప్పుడే విడుదలైన “ఢీ జోడి” నెక్స్ట్ వీక్ ప్రోమోలో ప్రదీప్ తనదైన పంచులు ప్రాసలతో సుధీర్ ని మళ్ళీ ఓ రేంజ్లో ఆటాడుకున్నాడు. 2018 ఈటీవీ ఉగాది ఈవెంట్ “ఆహానా పెళ్ళంటా” ప్రోగ్రాంలో హైలైట్ గా నిలిచిన సుధీర్,రేష్మి ల పెళ్లి కాన్సెప్ట్ ను వాడుకొని ప్రదీప్ తన హావభావాలతోనూ పంచులతోనూ సుధీర్ ని ఆటపట్టించాడు.సుధీర్ ని అటు రేష్మి ఇటు ప్రియామణి,శేఖర్ మాస్టర్లు కూడా ఓ రేంజ్లో ఆదుకున్నారు.ఇందులో కొస మెరుపుగా రేష్మి తన గుండెల్లోనూ ప్రియమణి తన గుండు లోను ఉన్నారంటూ ఏదో కవర్ చేద్దామని సుధీర్ ట్రై చేద్దామని చూసినా ప్రదీప్ చివర్లో ఎప్పటిలానే సుధీర్ ని వారిద్దరి మధ్యా ఇరికేంచేసి సూపర్బ్ కామెడీ పండించారు.

సూరజ్,మయూరి జంట “గీతగోవిందం”లోని వచ్చిందమ్మా వచ్చిందమ్మ పాటకి చేసిన పెర్ఫామెన్స్ క్లాసికల్ ఆడియెన్స్ ని ఆకట్టుకునే విధంగా చూడ ముచ్చటగా ఉంది. శేఖర్ మాస్టర్,ప్రియమణి మరియు హీరోయిన్ పూర్ణాలు న్యాయ నిర్ణేతలుగా ఈ షో కి వ్యవహరిస్తున్నారు.ఇంత చిన్న ప్రోమోలోనే ఇంత హాస్యం ఆకట్టుకునే డాన్సులు ఉంటే ఇక ఫుల్ ఎపిసోడ్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.ఈ ఫుల్ ఎపిసోడ్ చూడాలంటే వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలకి ఈటీవీ లో చూడాల్సిందే..