ప్రగతి నివేదన : 100 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్‌!.

Monday, September 3rd, 2018, 10:23:01 AM IST

టీఆరెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభ ముగిసిన అనంతరం ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమయ్యారు. రాజకీయ నాయకులు అందరూ వెళ్ళిపోయిన తరువాత ఒక్కసారిగా వాహనాలు ఔటర్ పైకి చేరుకున్నాయి. దీంతో ఊహించని లయ రహదారిపై ట్రాఫిక్‌ ఏర్పడింది. దాదాపు 100 కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. ప్రగతి నివేదన సభకు వివిధ జిల్లాల నుంచి సుమారు 80 వేల వాహనాలు తరలి వచ్చాయి. ఇక మరో ఐదు వేల వాహనాలు సభకుసమయానికి చేరుకోలేక మధ్యలోనే స్తంభించిపోయాయి.

అయితే సభకు వచ్చే తరుణంలోనే ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. సాయంత్రం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు పరిస్థితి అదుపులోకి రావడం కష్టమైంది. కొంగర్‌ కలాన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ రెండు వైపులా కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు కూడా ఆ సమయంలో తీవ్రంగా శ్రమించారు. సర్వీసు రోడ్లు అలాగే ప్రత్యామ్నాయ రోడ్లల్లోకి ఒక్కసారిగా వాహనాలు రావడం వల్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా చేసేదేమి లేక రోడ్లపైనే సేద తీరారు. బస్సుల్లోనే భోజనాలు చేసి పడుకున్నారు. ఇక పోలీసులు ట్రాఫిక్ ను నీరోదించడానికి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. సోమవారం మధ్యాహ్న సమయానికల్లా ఔటర్‌రింగ్‌రోడ్డు అలాగే సర్వీస్‌ రోడ్లపై వాహన రద్దీని క్రమబద్ధీకరిస్తామని వివరణ ఇచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments