జనసేనాని చుట్టూ ప్రజారాజ్యం..!

Thursday, October 26th, 2017, 01:20:57 AM IST

ప్రజారాజ్యం పార్టీ సమయంలో ఎదురైనా ఇబ్బందులని గుత్తెరిగిన జనసేనాని వాటిని అధికమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీ నిర్మాణంలో మెల్లగా ఒక్కో అడుగు వేస్తున్న పవన్ 2019 నాటికీ పార్టీని రెడీ చేసే పనిలో ఉన్నారు. కానీ జనసేన పార్టీలో ప్రజారాజ్యం వాసన పోలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

జనసేన పార్టీ ఇంకా విస్తృతం కాకపోవడంతో ఆ పార్టీలో అధికార ప్రతినిధులు పెద్దగా కనిపించరు. కానీ ఉన్న కొద్ది పదవుల్లో మాత్రం ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారే కనిపిస్తున్నారు. చిరుతో సన్నిహితంగా మెలిగిన జర్నలిస్టు హరిప్రసాద్ ప్రస్తుతం జనసేన మీడియా విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ తో సన్నిహితంగా మెలిగిన శేఖర్ గౌడ్ జనసేన తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటున్నారు. జనసేన తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తున్న మహేంద్ర రెడ్డి కామం మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సమయం నుంచి పవన్ తో సన్నిహితంగా ఉంటున్న వారే. పవన్ కళ్యాణ్ ఇలా ఉద్దేశపూర్వకంగా ప్రజారాజ్యం నేతలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారా లేక ఉన్న పరిచయాల నేపథ్యంలో వారిని జనసేనలోకి తీసుకున్నారా అనే చర్చ జరుగుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments