బిజెపి గెలవడానికి అవకాశమే లేదు: ప్రకాష్ రాజ్

Tuesday, May 1st, 2018, 03:44:10 PM IST

ఇప్పటి వరకు దేశంలో జరుగుతూ వస్తోన్న ఎన్నికల్లో జాతీయ పార్టీ బీజేపీ ఎంతో కొంత మెరుగుపడుతూ వస్తోంది. ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ బిజెపి విజయాన్ని అందుకునేందుకు చాలానే కృషి చేస్తోంది. అయితే కర్ణాటకలో ఈ నెలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో బీజేపీ పాలనపై వ్యతిరేకతతో ఉన్న ప్రకాష్ రాజ్ కూడా కర్ణాటక ఎన్నికలపై జోస్యం చెప్పారు. అక్కడ భారత జనతా పార్టీ గెలిచే అవకాశం లేదని గట్టిగా వివరణ ఇచ్చారు.

ఎందుకంటే ప్రజలు విభజించే పాలనను కోరుకోవడం లేదు. కర్ణాటకలో బీజేపీ రావడం అనేది ఒక కల. మతానికి – కులానికి మన దేశం పరిమితం కాదు. మనది ప్రజా స్వామ్య దేశం. దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలోకి రావడం జరగదు. ఆ పార్టీలో వేరొకరి సిద్దాంతాలతో నడుచుకోవాల్సి ఉంటుంది. మోడీ పార్టీలో నాయకుల నోరును అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వారిని మాట్లాడనివ్వండి. అలా అయినా వారి బుద్దేమిటో బయటపడుతుంది. వారి వివాదస్పద వ్యాఖ్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంకా ఎక్కువవుతూనే ఉంది. భాజపా వర్గ రాజకీయాలు చేయడం లేదని నిరూపించండి. ఆ ఛాలెంజ్ కు నేను సిద్ధమని ప్రకాష్ రాజ్ మాట్లాడారు. అదే విధంగా ఎన్నికల్లో వారు ఇచ్చిన హామీలను అమలు పరిస్తేనే నమ్మాలని, వట్టి మాటలు నమ్మవద్దని ప్రజలకు తెలియజేశారు.

Comments