పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలి: ప్రకాష్ రాజ్

Wednesday, May 9th, 2018, 07:41:51 AM IST

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గత కొంత కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో ముందుంటున్నారు. బీజేపీ పాలనలో లోపాలు ఉన్నాయంటూ మోడీ పై ఆయన ప్రతి విషయంలో విమర్శలు చేశారు. ఏ ఎన్నికల్లో అయినా మోడీ మాటలు నమ్మవద్దని ఆయన పదే పదే చెబుతూనే ఉన్నారు. పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ రాజకీయాలపై స్పందించారు.

ఆయన మాట్లాడుతు.. పవన్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. మంచి చేయాలనీ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చాడు. అయితే జనసేన లోకి వలస వచ్చే నేతలతో ఆయన జాగ్రత్తగా ఉండాలి వారు మోసం చేసే ప్రమాదం ఉంది. ప్రజలకు మంచి చేయాలనీ జనసేన పార్టీతో ప్రజల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించాలని ప్రకాష్ రాజ్ తన వివరణ ఇచ్చాడు. అదే విధంగా మోడీ మాటలు ఎంత మాత్రం నమ్మవద్దని మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెబుతూ.. ప్రశ్నిస్తే.. వ్యక్తి గత విషయాల్లోకి వస్తున్నారని తనకు కమర్షియల్ యాడ్స్ కూడా రానివ్వకుండా చేస్తున్నట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.