ప్ర‌కాష్‌రాజ్ సాధించిన ఘ‌న‌తే ఇది!

Sunday, June 3rd, 2018, 12:15:35 PM IST

శ్రీ‌మంతుడు స్ఫూర్తితో ప్ర‌కాష్‌రాజ్ తెలంగాణ‌లోని కొండారెడ్డి ప‌ల్లి విలేజ్‌ను ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ గ్రామం అభివృద్ధికి విల‌క్ష‌ణ న‌టుడు చాలానే చేశాడు. పొలాల‌కు వెళ్లే రైతుకు అధునాత‌న సాంకేతిక‌త‌ను అందించాడు. గ్రామంలో ప్ర‌తిదీ క‌రెక్టుగా ఉండేలా తీర్చిదిద్దాడు. ఆ క్ర‌మంలోనే ఆ ప‌ల్లెటూరి పంచాయితీకి చ‌క్క‌ని గుర్తింపు వ‌చ్చింది. ఇప్పుడు ఏకంగా తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా కేసీఆర్ ప్ర‌భుత్వం కొండారెడ్డి ప‌ల్లి పంచాయ‌త్‌కి రూ.10ల‌క్ష‌లు న‌జ‌రానా ప్ర‌క‌టించింది. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన ప్ర‌కాష్‌రాజ్ కేసీఆర్‌కి ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలిపారు. ఆ మేర‌కు గ్రామ‌పంచాయితీ ముఖ‌చిత్రాన్ని ప్ర‌కాష్‌రాజ్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఇదంతా ప్ర‌కాష్‌రాజ్ ఘ‌న‌తే అనుకోవాలి. అత‌డి స్ఫూర్తితో మ‌రింత‌మంది సెల‌బ్రిటీలు గ్రామాల ప‌రిర‌క్ష‌ణ‌కు ముందుకొస్తారేమో?