ఢిల్లీ సీఎం తో భేటీ అయిన ప్రకాష్ రాజ్

Thursday, January 10th, 2019, 07:15:45 PM IST

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బెంగుళూరు సెంట్రల్ నియోజక వర్గం నుండి స్వతంత్రంగా పోటీ చేయనున్నారని కూడా ప్రకటించారు ప్రకాష్ రాజ్. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా కలిసాడు. ఈ కలియైక ఇప్పుడు చర్చనీయంచంగా మారింది. ప్రకాష్ రాజ్ నిర్ణయాన్ని స్వాగతించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కి కృతజ్ఞతలు తెలపడానికి కలిశానని ప్రకాష్ రాజ్ చెబుతున్నప్పటికిని, కాస్త రాజకీయంగా కొత్త చర్చ తెరపైకి వచ్చేలా కనిపిస్తుందని అర్థమవుతుంది. ఈ మేరకు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. అందులో ‘నా రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలియజేశాను. ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటూ.. కొన్ని సమస్యలపై చర్చించాం. ఆ సమస్యలకు పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరాను’అన్నారు. చివర్లో #bengalurucentral #citizensvoice in parliament #justasking in parliament too అంటూ హ్యాష్ ట్యాగ్స్ పెట్టారు.